Dubbaka: దుబ్బాక ధర్మాజీపేటలో పేద కుటుంబాలకు ఆర్థిక సాయం!
Dubbaka: దుబ్బాక ధర్మాజీపేటలో మరణించిన 5 పేద కుటుంబాలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం. శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ సహకారంతో కౌన్సిలర్ల పంపిణీ.
Dubbaka: దుబ్బాక ధర్మాజీపేటలో పేద కుటుంబాలకు ఆర్థిక సాయం!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో గత కొన్ని రోజుల క్రితం మరణించిన పేద కుటుంబాలు అధైర్య పడకుండా ఆ మరణించిన కుటుంబ సభ్యులకు భరోసాగా శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ గారి సహకారంతో కుటుంబానికి 5000 రూపాయల చొప్పున 5 కుటుంబాలకు 9వ వార్డ్ కౌన్సిలర్ వనం రమేష్, 7వ వార్డ్ కౌన్సిలర్ గోవింద్ గారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్ గౌడ్, దుబ్బాక PACS డైరెక్టర్ వనం అశోక్ లు అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు,PACS డైరెక్టర్... శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజు గారికి ధర్మాజీపేట ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపి.. శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ గారి దివ్య ఆశీస్సులు ధర్మాజీపేటకు ఎల్లప్పుడు ఉండాలని కోరారు.




