Medak: ఏడుపాయల వనదుర్గమ్మకు శాఖాంబరి అలంకరణ: భక్తుల రద్దీ!

Medak: ఆషాడ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు వివిధ రకాల కూరగాయలతో విశేష శాఖాంబరి అలంకరణ. తెల్లవారుజాము నుంచే భక్తుల క్యూలైన్లు.

NAGARAJ, MEDAK
Published on: 19 July 2026 10:12 AM IST
Medak
X

Medak: ఏడుపాయల వనదుర్గమ్మకు శాఖాంబరి అలంకరణ: భక్తుల రద్దీ!

Medak: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని మాతను ఆషాడ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ఆలయ అర్చకులు గర్భగుడిని, వనదుర్గమ్మను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాఖాంబరిగా విశేషంగా అలంకరించారు. ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే అమ్మవారికి మంజీరా నది జలాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు.

ఆషాడ మాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మకు కూరగాయలే వస్త్రాభరణాలు అయ్యాయి. క్యారెట్, క్యాప్సికం, పచ్చిమిరపకాయలు, టమాటలు పూలదండలయ్యాయి. చెవులు కమ్మలుగా పొట్లకాయలు, అయ్యాయి. వజ్ర కిరీటంగా గోబీ పువ్వు అయ్యింది.. ప్రసాదంగా పండ్లకు బదులు గుమ్మడికాయలు, వంకాయ, దోసకాయలు అయ్యాయి.

దీపాలంకరణగా సొరకాయలు, పొట్లకాయలు అయ్యాయి. ఆషాడ మాసంలో ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకుంటే సీజనల్ వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.. ఆషాడ మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఏడుపాయలలో భక్తుల రద్దీ నేలకొంది.. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీరేశం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story