Siddipet: లింగాపూర్ వెంకటరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి.

KARUNAKAR,	DUBBAK
Published on: 25 Aug 2026 9:47 AM IST
Siddipet
X

Siddipet: లింగాపూర్ వెంకటరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని లింగాపూర్ వెంకటరావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ షాపులో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ రేషన్ కార్డుల విధానం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ సరుకులు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ సేవలు లబ్ధిదారులకు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క కుటుంబం కూడా సంక్షేమ పథకాలకు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story