Narsapur: నర్సాపూర్‌లో SIR-PHASE-IIపై కాంగ్రెస్ సమీక్షా సమావేశం!

Narsapur: నర్సాపూర్‌లో SIR-PHASE-IIపై కాంగ్రెస్ సమీక్ష పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, అంజనేయులు, వెన్నెల గద్దర్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 4 Sept 2026 6:44 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో SIR-PHASE-IIపై కాంగ్రెస్ సమీక్షా సమావేశం!

Narsapur: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ SIR–PHASE-IIపై నర్సాపూర్ పట్టణంలోని యాదవ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మెదక్ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.వి. వెన్నెల గద్దర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని BLAలు, సూపర్వైజర్లకు SIR–PHASE-II ప్రక్రియపై శిక్షణతో పాటు సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల వెరిఫికేషన్, నోటీసులు, ఫారమ్‌ల పరిశీలన తదితర అంశాలపై నాయకులు వివరించారు.

“ప్రతి ఓటు ఎంతో విలువైనదే” అని పేర్కొన్న నాయకులు.. ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా అత్యంత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని BLAలు, సూపర్వైజర్లకు సూచించారు.

ప్రతి బూత్ పరిధిలో ఎన్ని నోటీసులు జారీ అయ్యాయి.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సంబంధిత ఓటర్లతో వెరిఫికేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించి, వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఫారమ్‌లను ఎలాంటి తప్పులు లేకుండా నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.

బూత్ స్థాయి నుంచే పకడ్బందీగా..

SIR–PHASE-II ప్రక్రియలో బూత్ స్థాయిలో పకడ్బందీగా పనిచేయడం కీలకమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLAలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

SIR–PHASE-II ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLAలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story