Chegunta: చేవెళ్లలో ప్రతీ మంగళవారం, శుక్రవారం 'డ్రై డే'!

Chegunta: చేవెళ్ల పురపాలక సంఘం పరిధిలో దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం 'డ్రై డే' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 6 Aug 2026 4:58 PM IST
Chegunta
X

Chegunta: చేవెళ్లలో ప్రతీ మంగళవారం, శుక్రవారం 'డ్రై డే'!

Chegunta: చేవెళ్ల పురపాలక సంఘంలో ప్రతి మంగళవారం, శుక్రవారం “డ్రై డే” కార్యక్రమం.

చేవెళ్ల పురపాలక సంఘం పరిధిలో గల పట్టణ ప్రజలకు తెలియచేయునది ఏమనగా దోమల వృద్ధిని అరికట్టడం మరియు డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడం కోసం ప్రతి మంగళవారం మరియు శుక్రవారం “డ్రై డే” కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో, కార్యాలయాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను తొలగించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.

ప్రజలు పాటించవలసిన ముఖ్య సూచనలు

• ఇళ్లలో, కార్యాలయాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి.

• కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, పూల కుండీలు తదితర వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

• నీటి ట్యాంకులను తరచూ పరిశీలించి, మూతలు సక్రమంగా ఉండేలా చూడాలి.

• చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు చెట్ల కొమ్మలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వెంటనే తొలగించాలి.

• దోమల లార్వా (తోక పురుగులు) ఉన్న ప్రాంతాలను గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలి.

• తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచి, రక్షిత మంచినీటిని మాత్రమే వినియోగించాలి.

• జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు తదితర లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.

ప్రతి కుటుంబం ప్రతి మంగళవారం మరియు శుక్రవారం కనీసం 10 నిమిషాలు కేటాయించి తమ ఇల్లు, కార్యాలయం మరియు పరిసరాలను పరిశీలించి నీటి నిల్వలను తొలగించాలని చేవెళ్ల పురపాలక సంఘం ప్రజలను కోరింది.

“ప్రతి మంగళవారం, శుక్రవారం – డ్రై డే పాటిద్దాం, దోమల వ్యాధులను నివారిద్దాం.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story