Medak: మెదక్ జిల్లాలో ‘జనగణన–2027’ ప్రారంభం: 1.68 లక్షల ఇళ్లలో వివరాల సేకరణకు కసరత్తు!
Medak: మెదక్ జిల్లాలో జనగణన–2027 ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు.
Medak: మెదక్ జిల్లాలో ‘జనగణన–2027’ ప్రారంభం: 1.68 లక్షల ఇళ్లలో వివరాల సేకరణకు కసరత్తు!
మెదక్: దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో సోమవారం జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హవేలీ ఘనపూర్ మండలంలోని కూచన్‌పల్లిలో తొలి విడత ఇళ్ల జాబితా నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించగా, జిల్లావ్యాప్తంగా 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలను నియమించారు.ఈ సందర్భంగా 11 మంది బి-సూపర్వైజర్లు, 72 మంది ఎన్యూమరేటర్ల సమక్షంలో తొలి విడత ఇళ్ల జాబితా నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
స్వీయ గణన ప్రక్రియ ముగియడంతో జిల్లాలోని 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు.జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం 1,439 మంది ఎన్యూమరేటర్లు, 261 మంది సూపర్వైజర్లు, 25 మంది ఇన్‌చార్జ్ అధికారులను నియమించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మండల ఛార్జ్ అధికారులుగా 25 మందిని బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా, ఫిబ్రవరి నెలలో జనాభా లెక్కింపు చేపట్టనున్నట్లు సెన్సస్ అధికారులు వెల్లడించారు.




