Medak: కాలుష్య ఫ్యాక్టరీని మూసేయకపోతే హైవే దిగ్బంధిస్తాం!

Medak: అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ కాలుష్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఒంటేరి ప్రతాప్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిగింది.

NAGARAJ, MEDAK
Published on: 20 July 2026 5:37 PM IST
Medak
X

Medak: కాలుష్య ఫ్యాక్టరీని మూసేయకపోతే హైవే దిగ్బంధిస్తాం!

మెదక్ జూలై 20: రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న కాలుష్య పరిశ్రమ వెంటనే బంధు చేయాలని ప్రజాభిప్రాయ సేకరణ మరోసారి జరపాలని డిమాండ్ చేస్తూ రెండు గ్రామాల ప్రజలు సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ను కలవడానికి వచ్చిన గ్రామ ప్రజలు కలెక్టర్ లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని మనోహరాబాద్ మండల పరిధిలోని రంగాయిపల్లి చెట్ల గౌరవరం గ్రామాల సరిహద్దు ప్రాంతంలో సుమారు 200 ఎకరాలలో ఎంఎస్ఎన్ అగ్రవాల్ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొగ వల్ల ఆ ప్రాంతం మొత్తం కాలుష్యం అయిపోయిందని త్రాగునీటికి సైతం ఇబ్బంది కలుగుతుందని సాగు చేసుకుందామంటే కాలుష్యం మూలంగా పంట పొలాలు వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వాయు కాలుష్యం గ్రామాలలోని ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని మహిళలు వివిధ రోగాలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రమను వెంటనే ముసివేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రతాప్ రెడ్డి. పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ

ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని పారిశ్రమను వెంటనే మూసివేయాలని పరిశ్రమ వల్ల వచ్చు వాయు నేల నీరు కాలుష్యం అయిపోతుందని వీటివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఒకసారి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు అయినా ఎం ఎస్ అగర్వాల్ పారిశ్రామిక ఫ్యాక్టరీ కోసం ప్రజా అభిప్రాయ సేకరణ న్యాయబద్ధంగా జరగలేదని అన్నారు. అందులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా అవకతవక మధ్యన జరిగిందని మండిపడ్డారు. ప్రజల మన ప్రాణాలకు ముప్పు కలిగిన అధికారులు స్పందించకపోవడం ఇంతవరకు ఫ్యాక్టరీకి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమను తొందరగా మూసివేసి ఆ రెండు గ్రామాల ప్రజల ను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ అధికారులను డబ్బుతో కొన్నదని అక్కడున్న ప్రజలను గురించి పట్టించుకునే స్థితిలో లేదు అని అన్నారు ఆ కంపెనీని ప్రజల గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా ఫ్యాక్టరీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేస్తుందని గ్రామంలో యువకులు ఫ్యాక్టరీ గురించి అడిగితే వారిపై కేసులు పెడుతున్నారని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.

ఈ ఫ్యాక్టరీ మూసేసంతవరకు మరోసారి ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ విషయంపై స్పందించి రెండు గ్రామాల ప్రజలకు న్యాయం చేసి ఆ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. దశలవారీగా ఉద్యమాన్ని చేపడతామని జాతీయ రహదారిని సైతం ఇబ్బందం చేస్తామని వారి వెల్లడించారు ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి స్థానిక కౌన్సిలర్ దీపక్. రామంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story