Medak: బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలి.. బిఆర్ఎస్ నేతల డిమాండ్

Medak: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలపై మెదక్ బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

NAGARAJ, MEDAK
Published on: 12 May 2026 3:00 PM IST
Medak
X

Medak: బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలి.. బిఆర్ఎస్ నేతల డిమాండ్

Medak: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు డిమాండ్ చేశారు.మంగళవారం మెదక్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

కేసు దర్యాప్తులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.చట్టం అధికార పార్టీకోలా, సామాన్య ప్రజలకోలా వేర్వేరుగా అమలవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బిఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేసే పోలీసులు, ఈ ఘటనలో మాత్రం స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించారు.

దేశంలో మహిళల రక్షణ, బాలికల భద్రత గురించి పెద్ద ఎత్తున మాట్లాడే నాయకుల కుటుంబ సభ్యులే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సామాన్యుడైనా – కేంద్ర మంత్రిపుత్రుడైనా ఒకే విధమైన న్యాయం జరగాలని స్పష్టం చేశారు.కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడేందుకు రాజకీయ ప్రభావం ఉపయోగించకూడదని హెచ్చరించారు. బండి సంజయ్ కుమార్ తన కుమారుడిని రక్షించేందుకు అధికార ప్రభావాన్ని వినియోగిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసు దర్యాప్తును బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ పార్టీ కో కన్వీనర్లు గడ్డమీద కృష్ణగౌడ్, లింగారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ ఆర్కే. శ్రీనివాస్, నాయకులు ప్రభు రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story