Medak: కాంటా, రవాణా స్పీడ్ పెంచండి.. అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మిక తనిఖీ!

Medak: ధాన్యం కొనుగోలు, రవాణా వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశం.

G Ashok Reddy, Narsapur
Published on: 8 May 2026 1:24 PM IST
Medak
X

Medak: కాంటా, రవాణా స్పీడ్ పెంచండి.. అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మిక తనిఖీ!

Medak: సరిపడా సిబ్బంది ని పెట్టుకోండి ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు, 14వేల మంది రైతులకు 52 వేల కోట్ల రూపాయలు రైతుల ఎకౌంట్లో జమ. అదనపు కలెక్టర్ నగేష్. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు, రవాణా వేగం గా జరగాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని అదనపు కలెక్టర్ నగేష్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.

ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది..

ఎంత మందికి టోకెన్ ఇచ్చారు.. ఎంత కొనుగోలు చేసారు... లారీలు ఏ టైం కి వస్తున్నాయి... లోడింగ్, ఆన్ లోడింగ్ కి ఎంత టైమ్ పడుతుంది అని తదితర వివరాలను కలెక్టర్ కేంద్ర నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు. లారీ తో పాటు కేంద్ర నిర్వాహకులకి సంబందించిన వారు ఎవరైన ఒక్కరు తప్పకుండా ట్రక్ తో పాటు వెళ్లి... మిల్లు లలో తొందరగా ఆన్ లోడ్ అయ్యేలా చూడాలన్నారు. కేంద్రాలలో గాని.... మిల్లు ల వద్ద గాని ఏమైనా సమస్య లు తలేత్తితే వెంటనే రాత పూర్వకం గా తమ దృష్టి కి తీసుకరావాలని... వెంటనే తగు చర్యలు తీసుకుంటామని రైతులకు అదనపు కలెక్టర్ సూచించారు

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి 14వేల మంది రైతులకు 52 వేల కోట్ల రూపాయలు రైతుల ఎకౌంట్లో జమ. చేయడం జరిగిందన్నారు. ధాన్యాన్ని చివరికి గింజ వరకు కొంటాం రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని వివరించారు. అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడడానికి టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. లోడింగ్ ప్రక్రియను అతి త్వరగా చేపట్టాలని, లేబర్ ను, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని, నిబంధనల మేరకు తేమ శాతం ఉండాలని, నిర్వాహకులకు సూచించారు. మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను త్వరగా చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story