Kagaznagar: శ్రీ వాసవి జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. ఆర్యవైశ్యుల సంబరాలు
Kagaznagar: శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్యవైశ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Kagaznagar: శ్రీ వాసవి జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. ఆర్యవైశ్యుల సంబరాలు
Kagaznagar: శ్రీ వాసవ మాత జయంతిని రాష్ట్ర పండుగగా అధికారంగా ప్రకటించిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్యవైశ్యులు ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. కాగజ్ నగర్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చిత్రపటానికీ క్షీరాభిషేకం చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర పండుగ హోదా కల్పించడం వాసవి మాతకు ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహా సభ అధ్యక్షులు నాగేశ్వర్ రావు. జిల్లా రైస్ మిల్స్ అధ్యక్షులు చిలువేరు సత్యనారాయణ,పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కె సెంకరయ్య, జిల్లా ఆర్యా వైశ్య మాజీ అధ్యక్షులు జి చెక్రపాణి, జిల్లా ఆర్యవైశ్య సంగం ఉపాధ్యక్షులు ఆనంతుల సురేష్, పైడా శ్రీనివాస్,పట్టణ ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు మైలారం మురళీధర్,




