Mancherial: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి - 16 మంది అరెస్ట్!
Mancherial: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్లెంపల్లిలో కోడిపందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి. 16 మంది అరెస్ట్, రూ.24,040 నగదు స్వాధీనం.
Mancherial: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి - 16 మంది అరెస్ట్!
Mancherial: వేమనపల్లి మండలం లోని కల్లెంపల్లి గ్రామ శివారులో కోడి పందేల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై రమేష్, నీల్వాయి ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి నిన్న అర్ధరాత్రి దాడి నిర్వహించారు.
ఈ దాడిలో కోడి పందేలు నిర్వహిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 4 కోళ్లు, 45 కత్తులు,18 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు, రూ.24,040 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న 16 మందితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు,వస్తువులు, ద్విచక్రవాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నీల్వాయి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వం నిషేధించిన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.
కోడి పందేలు,జూదం, బెట్టింగ్ తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు.
ఇలాంటి కార్యకలాపాలకు స్థావరాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం,వాటికి సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.




