Sirpur T: సిర్పూర్ (టి)లో నీట్ పేపర్ లీకేజీపై నిరసన

Sirpur T: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి)లో నీట్ పేపర్ లీకేజీపై శాంతియుత నిరసన. కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్. మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప.

SRINIVAS, KOUTALA
Published on: 24 July 2026 7:16 PM IST
Sirpur T
X

Sirpur T: సిర్పూర్ (టి)లో నీట్ పేపర్ లీకేజీపై నిరసన

సిర్పూర్ టి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుద్ధుని విగ్రహం ఎదుట విద్యార్థులు నిరుద్యోగ యువకులు శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బహుజన నాయకులు దుర్గం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడం మహిళా విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మాజీ MLA కోనేరు కోనప్ప మద్దతు తెలిపారు

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story