Asifabad: అటవీ అధికారుల ఆగడాలు మితిమీరాయి ఎమ్మెల్యే హరీష్ బాబు!
Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంచలన వ్యాఖ్యలు; పోడు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు.
Asifabad: అటవీ అధికారుల ఆగడాలు మితిమీరాయి: ఎమ్మెల్యే హరీష్ బాబు
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అటవీశాఖ అధికారుల ఆగడాలు మితిమీరిపోయాయని, ప్రజలు సంఘటితంగా వారిని ఎదుర్కోవాల్సిందిగా పిలుపునిచ్చారు.
ములుగు జిల్లాలో సమ్మక్క జాతర సందర్భంగా వేలకోట్ల అభివృద్ధి పనులు అటవీ ప్రాంతంలో చేపట్టారని, దానికి అవసరం లేని పర్మిషన్ ఇక్కడే ఏమొచ్చిందని ప్రశ్నించారు.
పోడు రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెడితే సహించేది లేదని, వారికి పూర్తి అండగా నిలుస్తామని తెలిపారు.
మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం కోసం HAM నిధులు మరియు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులు వినియోగించనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విటల్, ఎంపీడీవో గాజుల శ్రీనివాస్, తాసిల్దార్ రవీందర్ నాయక్, స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




