Sirpur: మూడు మండలాల్లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు
Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు. పోలీసుల నిబంధనలతో ప్రశాంతంగా పూజలు నిర్వహిస్తున్న భక్తులు, యువకులు.
Sirpur: మూడు మండలాల్లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు
సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో చింతలమానేపల్లి బెజ్జూర్ కౌటాల మండలాలలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలాలలోని అన్ని గ్రామాల్లో గణనాథుడు గజముఖ గణపతి కొలువు తీరాడు.
కౌటాల బెజ్జూర్ చింతలమానేపల్లి బాబాపూర్ గంగాపూర్ కర్జవెళ్ళి గూడెం డబ్బా కన్నెపల్లి బోధపల్లి గురుడు పేట బాబసాగర్ ధరంపల్లి బారెగుడ, బెజ్జూర్ రోడ్ తదితర గ్రామాల్లో యువకులు ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఏర్పాటు చేసిన మండపాలలో పూజారులు వేద మంత్రాలతో గణపతికి అభిషేకాలు అలంకరణలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.
పోలీసుల సూచనలతో ప్రశాంతంగా ఉత్సవాలు:
పోలీస్ శాఖ ముందస్తు అనుమతితోనే మండపాల ఏర్పాటు చేశారు. https://policeportal.tspolice.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న కమిటీలకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
డీజే శబ్ద కాలుష్యం లేకుండా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
భక్తుల రద్దీ
మండపాల దగ్గర చిన్నారులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాయంత్రం వేళల్లో భజనలు కోలాటాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లడ్డూ వేలం పాటలు కూడా నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నారు.
10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.




