Asifabad: సెప్టెంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్: ఎమ్మెల్యే హరీష్‌బాబు

Asifabad: ప్రధాని మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే తెలిపారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 15 Sept 2026 6:10 PM IST
Asifabad
X

Asifabad: సెప్టెంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్: ఎమ్మెల్యే హరీష్‌బాబు

Asifabad: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు సిర్పూర్‌ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు..

కొమురం భీమ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17న మోదీ క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంట్లో ఆశీస్సుల దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్‌ 7 వరకు పాఠశాలలు, కళాశాలల్లో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు, కళాజాతాలు నిర్వహిస్తామన్నారు.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌ మిలన్‌ కార్యక్రమం ద్వారా మాతృమూర్తులు, సిబ్బందిని సన్మానిస్తామని చెప్పారు.

అక్టోబర్‌ 7న సేవాజ్యోతి యాత్ర, టార్చ్‌ ర్యాలీలు చేపడతామని.. రక్తదాన, వైద్య శిబిరాలతో పాటు మొక్కలు నాటడం, ఫిట్‌ ఇండియా, నీటి సంరక్షణ, సైబర్‌ భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే హరీష్‌బాబు వెల్లడించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR