Asifabad: కన్నెపల్లి గ్రామపంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామపంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Asifabad: కన్నెపల్లి గ్రామపంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర్లె పార్వతి, ఉప సర్పంచ్ మోర్లె సమత–రాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి తుడుపునూరి సాయి కృష్ణ, వార్డు సభ్యులు, యువ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Next Story




