Asifabad: చింతలమానపల్లి: కోడిపందాల స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం గూడెంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Asifabad: చింతలమానపల్లి: కోడిపందాల స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానపల్లి మండలంలోని గూడెం గ్రామంలో కోడిపుంజులు పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చింతలమాలపల్లి ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు
గూడెం గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. పందాల కోసం తీసుకొచ్చిన 5 కోడిపుంజులను 1560 రూపాయలను 2 కత్తులను, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు.
పట్టుబడిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.




