Bejjur: సిర్పూర్ నియోజకవర్గంలో ఘనంగా 'ఏడ్ల పోలాల అమావాస్య'!

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఏడ్ల పోలాల అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించిన రైతులు. బసవన్నలకు ప్రత్యేక పూజలు, ఆలయాల్లో ప్రదర్శనలు.

SRINIVAS, KOUTALA
Updated on: 11 Sept 2026 1:50 PM IST
Bejjur
X

Bejjur: సిర్పూర్ నియోజకవర్గంలో ఘనంగా 'ఏడ్ల పోలాల అమావాస్య'!

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో బెజ్జూర్ చింతలమానేపల్లి కౌటాల మండలాలలో ఏడ్ల పోలాల అమావాస్య వేడుకలను రైతులు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించారు.

తమకు వ్యవసాయంలో తోడుగా అండగా నిలిచే ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలతో అందంగా తీర్చిదిద్ది గజ్జెలు కట్టి డప్పు వాయిద్యాలు మంగళ హారతుల నడుమ వివిధ గ్రామాల్లో కోలాహలంగా ఊరేగించారు.

అనంతరం గ్రామాల్లో హనుమాన్ ఆలయాల వద్దకు పోచమ్మ ఆలయాల వద్ద ర్యాలీగా బయలుదేరిన రైతులు ఎడ్లతో ప్రదర్శనలు నిర్వహించి ఆలయాల చుట్టూ హరహర మహా దేవ అంటూ మహా దేవుణ్ణి వేడుకున్నారు.

ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని పాడి పశువులు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంస్కృతీ సంప్రదాయాలను ప్రకృతిని పశువులను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని కంటికి రెప్పలా కాపాడే ఎద్దులను పూజించడం రైతులకు మూగజీవాలకు ఉన్న అవినాభావ సంబంధానికి నిదర్శనమని రైతులు అన్నారు.

నిరంతరం కష్టపడే రైతన్నలు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని ఈ ఏడాది కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేవతలను వేడుకున్నట్లు తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA