Kagaznagar: నాగపూరి చందు కుటుంబాన్ని ఆదుకుంటాం: సిర్పూర్ ఎమ్మెల్యే!
Kagaznagar: ద్యుత్ షాక్‌తో మృతి చెందిన నాగపూరి చందు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హామీ ఇచ్చారు.
Kagaznagar: నాగపూరి చందు కుటుంబాన్ని ఆదుకుంటాం: సిర్పూర్ ఎమ్మెల్యే!
కాగజ్ నగర్: కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన నాగపూరి చందు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచికల్పెట్ మండలం మోట్లగూడ వద్ద కరెంటు పోల్ పై పనిచేస్తున్న నాగపూరి చందు విద్యుత్ షాక్ కు గురై చనిపోవడం బాధాకరమైన విషయమని తెలియజేశారు.
వారి కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని, పెన్షన్ తో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
Next Story




