Mancherial: కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు!
Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో రూ.50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ.
Mancherial: కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు!
Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రూ.50 లక్షల నిధులతో చేపట్టిన విద్యార్థుల కనీస వసతుల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి, ఎంపీ ఆకాంక్షించారు.
పాఠశాలు, కళాశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా చేస్తామని,రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందించాలని చూస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా విభాగంలో అందిస్తున్న అవకాశాలను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
యువత తమ బంగారు భవిష్యత్తును రాజకీయ ప్రేరేపణలకు బలిచేయకుండా విద్య, ఉద్యోగాలు, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, మరోవైపు యువతను రెచ్చగొట్టే లాగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ వ్యాఖ్యలు వారి భవిష్యత్తుకు నష్టం చేస్తాయని ఆయన సూచించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించే స్థాయికి ఎదగాలని అన్నారు.తెలంగాణ పేద కుటుంబాల పిల్లలు జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగాలు సాధిస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారో యువత ఆలోచించాలని వంశీకృష్ణ అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగిన నాయకులు వారిని వివాదాలు, కేసుల వైపు నడిపించడం సరైన విధానం కాదని విమర్శించారు.
యువతకు ఉచిత కోచింగ్, విద్యా వసతులు, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడమే ముఖ్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.




