Mancherial: చెన్నూర్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ విశాఖ ప్రారంభం

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ నూతన క్లబ్ ప్రారంభం. తొలి అధ్యక్షుడిగా తారాచంద్ దేవుడా ఎన్నిక.

RAJENDER, CHENNUR
Published on: 24 July 2026 5:08 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూర్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ విశాఖ ప్రారంభం

మంచిర్యాల: చెన్నూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ నూతన క్లబ్‌ను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, సేవాభావం కలిగిన సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ తొలి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ తొలి అధ్యక్షుడిగా లయన్ తారాచంద్ దేవుడా, కార్యదర్శిగా లయన్ మొహమ్మద్ జైనుల్, కోశాధికారిగా లయన్ చెరుకు తిరుపతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు 20 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

ప్రజా సేవే లక్ష్యంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తూ చెన్నూర్ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ నూతన కార్యవర్గం స్పష్టం చేసింది.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story