Mancherial: చెన్నూరులో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎంజేపీ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు. హాజరైన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పీ. రవి. వంటగది, భోజన నాణ్యత పరిశీలన.

RAJENDER, CHENNUR
Published on: 24 July 2026 6:22 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరులో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు

మంచిర్యాల: చెన్నూరు పట్టణ కేంద్రంలోని ఎంజెపి మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి. రవి ముఖ్య అతిథిగా హాజరై న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పాఠశాలలో వంటగది, భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి ఆరా తీసి జడ్జి రవి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, మహిళా చట్టాలు, బాలికల భద్రత, సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, వంటి అంశాలపై విద్యార్థులకు జడ్జి రవి అవగాహన కల్పించారు.

విద్యార్థి దశ నుండే భారత దేశ న్యాయస్థానం, చట్టాలపై కొంతవరకైనా అవగాహన కలిగి ఉండాలని సూచించారు దీంతో విద్యార్థులు మునుముందు వారి భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకుండా ఉంటారని తెలిపారు. పాఠశాల కళాశాలలోని విద్యార్థులకు తప్పనిసరిగా చదువుతో పాటు చట్టాలపై కూడా అవగాహన కలిపించడం ఎంతో అవసరమని జడ్జి రవి పేర్కొన్నారు.

సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు సాధించాలని కోరారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ప్రేరణ కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి. ఈ కార్యక్రమంలో చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతనేని రవి, చెన్నూరు బార్ కౌన్సిల్ మెంబర్లు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story