Mancherial: గంజాయి బానిసలైన 10 మంది యువకులు పునరావాస కేంద్రానికి!

Mancherial: భీమారంలో గంజాయికి బానిసలైన 10 మంది యువకులను గుర్తించిన పోలీసులు. మెడికల్ టెస్టుల అనంతరం కౌన్సెలింగ్ కోసం రీహ్యాబిలిటేషన్ సెంటర్‌కు తరలింపు.

RAJENDER, CHENNUR
Published on: 3 Sept 2026 9:49 AM IST
Mancherial
X

Mancherial: గంజాయి బానిసలైన 10 మంది యువకులు పునరావాస కేంద్రానికి!

Mancherial: భీమారం మండలంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగానికి అలవాటు పడిన 10 మంది యువకులను గుర్తించి, వారికి గంజాయి వినియోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంబంధిత పునరావాస (Rehabilitation) కేంద్రానికి తరలించి చికిత్స మరియు కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు చేపట్టారు.

గ్రామాలలోని ప్రజలు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

“మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని” అని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ACP వెంకటేశ్వర్, జైపూర్ CI నవీన్ కుమార్ , భీమారం SI రాజేందర్ పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story