Mancherial: ఆదివాసీపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి ఎస్సీ ఎస్టీ కేసు డిమాండ్
Mancherial: మంచిర్యాల జిల్లా లింగాలలో ఆదివాసీ ఆత్రం బాపుపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజశేఖర్ దాడి చేశారు. అధికారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం డిమాండ్.
Mancherial: ఆదివాసీపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి ఎస్సీ ఎస్టీ కేసు డిమాండ్
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులు ఆదివాసుల పైన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో ఆదివాసి ఆత్రం బాపు ను 3/9/2026 గురువారం రోజున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజశేఖర్ కొట్టడాన్ని ఆదివాసులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం ఆత్రం బాపు ను పరమర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు చిక్కుడు మొక్కలకు సపోర్టుగా కొన్ని కర్రలు కావాలని అడవిలోకి వెళ్లి వాటిని సేకరిస్తున్న క్రమంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ రాజశేఖర్ ఆత్రం బాపు పై విరుచుకుపడి విచక్షణారహితంగా కొట్టారని
నన్ను కొట్టకండి నేను దండం పెడతాను నన్ను క్షమించండి సార్ అని ఎంత ప్రాధేయపడ్డ వినకుండా ఆత్రం బాపు ను మరియు తనతో వచ్చిన వారి బామ్మర్ది తుమ్ముడి అర్జయ్య నీ కూడా కొట్టి 5000 డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారి పైన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని ఉద్యోగంలో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాజశేఖర్ ఇక్కడికి బీట్ ఆఫీసర్ గా వచ్చిన నాటినుండి ప్రజల పైన ఏ కారణం లేకుండా విరుచుకుపడి కోడుతున్నారని మండిపడ్డారు, మేకలు మేపడానికి వెళ్లిన మేకల కాపరినీ కొట్టారని అన్నారు. ఈ జిల్లాలో ఇంధనపల్లి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగిందన్నారు, ప్రతినిత్యం ఆదివాసుల పైన ఎక్కడో ఒకచోట దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి.
అందులో కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి ఇట్లాంటి ఘటనలు అనేక ఉన్నాయని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వము మరియు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు ఐటిఐ పిఓ గారు జోక్యం చేసుకొని ఆత్రం బాపుని మరియు వారి బామ్మర్దిని కొట్టిన అటవీ బీట్ ఆఫీసర్ రాజశేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశారు లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.




