Bellampalli: బెల్లంపల్లి పూలే గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మహాత్మ జ్యోతిబా పూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 July 2026 7:44 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లి పూలే గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.

నిన్న రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థినులు వాంతులు, వికారం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురికావడంతో వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల చికిత్స అనంతరం కొందరు విద్యార్థినులు తిరిగి హాస్టల్‌కు వెళ్లగా, ఈ ఉదయం మళ్లీ పలువురికి వాంతులు, వికారం రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో మరోసారి విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండగా, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫుడ్ పాయిజన్‌కు గల అసలు కారణాలపై అధికారులు ఆరా తీస్తుండగా, హాస్టల్‌లో అందించిన ఆహార నమూనాలను పరీక్షలకు పంపించి కలుస్తావారాన్ని విద్యార్థులకు పెట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు విద్యార్థినిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు..

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story