Mancherial: పూజల పేరుతో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన

Mancherial: లక్షెట్టిపేటలో పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబా పెండం సత్యంపై పోక్సో కేసు నమోదు. మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 11 Sept 2026 7:13 PM IST
Mancherial
X

Mancherial: పూజల పేరుతో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట పూజల పేరుతో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిపై లక్షెట్టిపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు..

లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పెండం సత్యం దొంగ బాబాగా అవతారం ఎత్తి పూజల పేరుతో మహిళలు, బాలికలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో బంగారం, నిధి నాణేలు ఉన్నాయని, వాటి కోసం కన్యతో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి అమాయకులను నమ్మించేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పూజల పేరుతో మహిళలు, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఫొటోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారం గత రెండు, మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికతో పూజల పేరుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో.. బాలిక కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.