Mancherial: నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. అధికారులకు అదనపు కలెక్టర్ వి. రాములు ఆదేశం!
Mancherial: మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అదనపు కలెక్టర్ వి. రాములు పరిశీలించారు.
Mancherial: నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. అధికారులకు అదనపు కలెక్టర్ వి. రాములు ఆదేశం!
మంచిర్యాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అధికారులను ఆదేశించారు. ఆదివారం లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మండల తహసీల్దార్ దిలీప్ కుమార్, మండల వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించి కొనుగోలు సమస్యలను పరిష్కరించారు. రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా గోదాముల్లో నిల్వ ఉంచే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని, గోదాముల సామర్థ్యం, హమాలీల సేవలను సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. అనంతరం జైపూర్ మండలం ఇందారం, రామారావుపేటలోని సుముఖ గోదామును కార్మిక శాఖ సహాయ కమిషనర్‌తో కలిసి సందర్శించి మిల్లర్లు, గోదాం నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ నెలాఖరు వరకు 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతున్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు.




