Mancherial: కాసిపేట-2 గనిలో ప్రమాదం - నలుగురు కార్మికులకు గాయాలు

Mancherial: మందమర్రి కాసిపేట-2 అండర్‌గ్రౌండ్ గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

PRATHAP, BELLAMPALLI
Updated on: 7 Sept 2026 9:24 PM IST
Mancherial
X

Mancherial: కాసిపేట-2 గనిలో ప్రమాదం - నలుగురు కార్మికులకు గాయాలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. మిడిల్ షిఫ్ట్‌లో గనిలోని 18 డిస్ట్రిక్ట్‌లో బ్లాస్టింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు.

ఈ ఘటనలో సపోర్ట్‌మెన్లు రమేష్, రాజ్‌కుమార్, క్రాంతి, పుప్పాల శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన నలుగురు కార్మికులను ప్రథమ చికిత్స నిమిత్తం మందమర్రి సింగరేణి కంపెనీ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం గాయపడిన కార్మికులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలను అధికారులు విచారణ జరిపి ప్రమాదాన్ని కారణమైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కార్మికులు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story