Mancherial: చెన్నూరు నియోజకవర్గంలో 108, 104 అంబులెన్సుల తనిఖీ

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 108, 104, 1962 అంబులెన్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రత్యేక ప్రధాన అధికారి ప్రసాద్ రాజు.

RAJENDER, CHENNUR
Published on: 24 July 2026 4:33 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరు నియోజకవర్గంలో 108, 104 అంబులెన్సుల తనిఖీ

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాలలో 108 ప్రధాన కార్యాలయ ప్రత్యేక ప్రధాన అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 108 అంబులెన్సులు, 104 అంబులెన్సులు, 1962 పశు సంచార అంబులెన్సులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

అంబులెన్స్ వాహనాలతో పాటు వాటి రికార్డులు, అందులోని పరికరాలు వాటి పనితీరు, అంబులెన్స్ వాహనాల పనితీరు, అలాగే వాటిలో సరిపడా మందులు ఉన్నాయా లేవా వంటి అంశాలపై విచారణ జరిపి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వాహనాలలో ఏమైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతర సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకునేలా చూడాలని అంబులెన్సుల సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ 108 ప్రధాన కార్యాలయ ప్రత్యేక ప్రధాన తనిఖీ అధికారి ప్రసాద్ రాజు తో పాటు, అదిలాబాద్ ఉమ్మడి జిల్లా 108 జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మంచిర్యాల జిల్లా 108 జిల్లా మేనేజర్ కొండలరావు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story