Mancherial: అదనపు కట్నం వేధింపులు భార్య ముక్కు కొరికిన భర్త!

Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అదనపు కట్నం వేధింపులు.. గొడవ సమయంలో భార్య ముక్కు కొరికిన భర్త, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి బాధితురాలు.

RAJENDER, CHENNUR
Published on: 16 Sept 2026 10:06 AM IST
Mancherial
X

Mancherial: అదనపు కట్నం వేధింపులు భార్య ముక్కు కొరికిన భర్త!

Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భార్యపై భర్తకు కోపం రావడంతో ఇదే అదునుగా భార్య ముక్కును కొరికేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తుడైన భర్త భార్య ముక్కు ను కొరికిన ఘటన కోటపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు అదే మండలం మల్లంపేట గ్రామం కు చెందిన ఎనగందుల మణిచందర్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కట్నం విషయంలో తరచూ గొడవ చేస్తున్నాడు.

గత పది రోజుల క్రితం భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో దీంతో భర్తపై విసుగు చెందిన మమత పిల్లలతో కలిసి తల్లిదం డ్రుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మణిచందర్ తన కుటుంబ సభ్యులతో కోటపల్లి మండల కేంద్రంలోని తన భార్య అయిన మమత ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. మమత తండ్రి నారాయణపై దాడికి యత్నించగా, కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన భార్య ముక్కును బలంగా కొరకడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు మమతను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR