Kagaznagar: బారేగూడలో కొత్త అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Kagaznagar: కాగజ్‌నగర్ మండలం బారేగూడలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Kagaznagar: బారేగూడలో కొత్త అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కాగజ్ నగర్: కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బారేగూడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.12 లక్షల రూపాయల అంచనాతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం లోపం లేకుండా ప్రభుత్వం ఈ ఐసిడిఎస్ పథకాన్ని చేపడుతుందని , ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ సర్పంచ్ కోట వేణు యాదవ్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా, సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గారు హమీ ఇచ్చారు.
Next Story




