Chintalamanepally: చింతలమానేపల్లి మండలంలో పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Chintalamanepally: చింతలమానేపల్లి మండలంలో వరి, పత్తి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన.

SRINIVAS, KOUTALA
Published on: 16 Sept 2026 5:33 PM IST
Chintalamanepally
X

Chintalamanepally: చింతలమానేపల్లి మండలంలో పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

చింతలమానేపల్లి: చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆడేపల్లి మరియు బాబాసాగర్ గ్రామాల్లో శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించింది.

ఈ సందర్భంగా వరి మరియు పత్తి పంటలను పరిశీలించి పంటల్లో ఏర్పడిన పురుగు మరియు తెగుళ్ల సమస్యలను గుర్తించేందుకు పురుగు, తెగుళ్ల నిర్ధారణ నిర్వహించారు.

ఈ క్షేత్ర సందర్శనలో డా. ఎం. మధు, TRVK శాస్త్రవేత్త; డా. ఎన్. మహేష్, కృషి విజ్ఞాన కేంద్రం (KVK), బెల్లంపల్లి శాస్త్రవేత్త; డా. ఎన్. సాంధ్వి, కృషి విజ్ఞాన కేంద్రం (KVK), బెల్లంపల్లి శాస్త్రవేత్తలు

చింతలమానేపల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీ, కె. కార్తీషా, డబ్బా వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ బి. సిద్ధార్థ, బాబాసాగర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీమతి ఆర్. మీనా పాల్గొన్నారు.

క్షేత్ర పరిశీలనలో గుర్తించిన అంశాలు

వరి పంటలను పరిశీలించిన సందర్భంగా కొన్ని పొలాల్లో ఆకు చివరలు ఎండిపోవడం గమనించబడింది. సంబంధిత భూముల్లో చౌడు ఉండడం వలన ఇలా జరుగుతుంది అని తెలపడం జరిగింది.రైతులు తప్పనిసరిగా మృత్తికా పరీక్షలు నిర్వహించి భూమి స్వభావాన్ని నిర్ధారించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.

చౌడు భూములు మెరుగుపరచేందుకు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువుల పంటలను సాగు చేసి, విత్తిన 45 రోజుల అనంతరం వాటిని పొలంలోనే దున్ని కలియదున్నాలని సూచించారు.

అదేవిధంగా వరి పంటలో బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ (బాక్టీరియా ఆకు ఎండ తెగులు) లక్షణాలను గుర్తించారు. నత్రజని ఎరువులు, ముఖ్యంగా యూరియాను అధికంగా వినియోగించకుండా, సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలని రైతులకు సూచించారు.

అధిక నత్రజని వినియోగం వల్ల ఆకులు మృదువుగా మారి, పురుగు మరియు తెగుళ్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.BLB సోకిన fields లో nitrogen వాడకం తగ్గించాలని తెలిపారు.తెగులు వ్యాప్తిని నియంత్రించేందుకు నివారణ చర్యగా పిచికారీ: వరి పంటలో పిలకల దశ ప్రారంభంలో లేదా తెగులు లక్షణాలు మొదటిసారిగా కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 50% WP ను సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేయాలి.

తెగులు సోకిన అనంతరం చేపట్టే చర్యగా పిచికారీ: తెగులు మచ్చలు విస్తరిస్తున్నప్పుడు స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ + టెట్రాసైక్లిన్ కలయికను సిఫారసు చేసిన మోతాదులో ఉపయోగించాలి. తగిన సమగ్ర పంట యాజమాన్య చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

పంటలలో అంతర పంటల విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి 4 వరుసల వరి తరువాత 1 వరుస కందిని సాగు చేసే విధంగా 4:1 నిష్పత్తిలో కందిని అంతర పంటగా సాగు చేయాలని రైతులకు సూచించారు.

పింక్ బోల్ వామ్ నుండి రక్షణ కొరకు ఖచ్చితంగా వేసవిలో లోతు దుక్కి చేయాలని ఎప్పటికప్పుడు పంటలను పరిశీలించాలని వేప నూనె కచ్చితంగా స్ప్రే చేయాలని సూచించారు.

అధిక ఉష్ణోగ్రతలు ,అధిక తేమ,అధిక వర్షాలు పూత రాలిపోతుందని తెలిపారు.పూత రాలిపోవడం అధికంగా ఉన్నపుడు ప్లానోఫిక్స్ స్ప్రే చేయాలని సూచించారు.

అలాగే వరి మరియు పత్తి పంటల్లో రసాన్ని పీల్చే పురుగుల నియంత్రణకు అవసరాన్ని బట్టి వేపనూనె మరియు ఇమిడాక్లోప్రిడ్ వంటి సస్యరక్షణ చర్యలను సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వినియోగించాలని సూచించారు.

రైతులు పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, పురుగు మరియు తెగుళ్ల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తల సూచనల మేరకు తగిన సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA