Kotapalli: కోటపల్లిలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

Kotapalli: కోటపల్లి మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన. ప్రాణహిత, గోదావరి వరద ఉధృతి పరిశీలన. అధికారులకు, ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ.

RAJENDER, CHENNUR
Published on: 29 July 2026 4:23 PM IST
Kotapalli
X

Kotapalli: కోటపల్లిలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

కోటపల్లి: కోటపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రాణహిత, గోదావరి నదిలో ప్రవహిస్తున్న వరద నీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

అన్ని శాఖల అధికారులు ఎల్లప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి ఇండ్లు, పెంకుటిల్లు, రేకుల ఇండ్లలో నివసించే ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైతే వాటిని ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు స్థితిలావస్థలో నివసిస్తున్న ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, కురుస్తున్న భారీ వర్షాలకు ఇండ్లు ఎప్పుడైనా కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున పలు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులు, కాలువలు, చెరువులలో వరద నీరు చేరుతున్నందున ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని అలాగే నదిలో సరదాగా ఈతకు, స్నానాలకు కానీ వెళ్ళకూడదని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అధికారులు ఇప్పటికే అప్రమత్తమై గ్రామాలలోని ప్రజలకు పలు సూచనలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గ్రామాలలోని ప్రజలందరూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా సహాయ చర్యలు కావాల్సినట్లయితే వెంటనే సహాయ బృందాలు లేదా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. అత్యవసర పరిస్థితులలో తప్ప గ్రామాలలోని ప్రజలు ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకి వెళ్ళవద్దని ఇప్పటికే ఉన్నదా అధికారులు విజ్ఞప్తి చేశారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story