Sirpur: బీఆర్‌ఎస్ రైతు సభతో కాంగ్రెస్‌కు దడ పుట్టింది!
Sirpur: సిర్పూర్‌లో బీఆర్‌ఎస్ ‘22ఏ’ రైతు సభతో కాంగ్రెస్‌కు దడ పుట్టింది కాంగ్రెస్‌కు నేనే భిక్ష పెట్టా: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.
Sirpur: బీఆర్‌ఎస్ రైతు సభతో కాంగ్రెస్‌కు దడ పుట్టింది!
Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘22ఏ’ నిషేధిత జాబితా రైతుల సమావేశంతో అధికార కాంగ్రెస్ నేతలకు దడ పుట్టిందని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ భిక్ష పెట్టలేదని, తానే ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి భిక్ష పెట్టానని కోనప్ప అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి సిర్పూర్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
సిర్పూర్ తాలూకాలో ‘22ఏ’ భూముల సమస్యపై బీఆర్‌ఎస్ నిర్వహించిన రైతు సదస్సుకు వచ్చిన స్పందనతో అధికార కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. రైతు సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ నేతలకు మతిపోయినంత పనైందని ఎద్దేవా చేశారు.
తాలూకా అభివృద్ధిపై అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీజేపీకి కనీస అవగాహన లేదని విమర్శించారు. సర్పంచులు, కౌన్సిలర్లకు తాయిలాలు చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
పూర్తి అవగాహన లేకుండా బీఆర్‌ఎస్‌పై అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, తగిన విధంగా స్పందిస్తామని కోనప్ప హెచ్చరించారు. అమాయక రైతులు, ప్రజలను అధికారుల అండదండలతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కోనేరు కోనప్ప తేల్చిచెప్పారు.




