Yellur: ఎల్లూర్ గ్రామంలో ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ!

Yellur: ఎల్లూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రవేశించిన భారీ కొండచిలువను అటవీ శాఖ రెస్క్యూ బృందం చాకచక్యంగా పట్టుకుని రక్షిత అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టింది.

SRINIVAS, KOUTALA
Published on: 23 Aug 2026 5:27 PM IST
Yellur
X

Yellur: ఎల్లూర్ గ్రామంలో ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ!

ఎల్లూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచిలక్పేట మండలంలోని ఎల్లూర్ గ్రామంలోని ఒ ఇంటిలో కొండచిలువ (Python) కలకలం రేపింది, ఇంటిలో ప్రవేశించిందని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుతున్న అటవీ శాఖ రెస్క్యూ టీమ్ తక్షణమే స్పందించింది. DRO అస్మా, FBO సతీష్ మరియు అనిమల్ ట్రాకర్స్ రాజు, రామయ్య, నందు నాయక్, వసంత్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పాములు పట్టుకునే రెస్క్యూ పరికరాల సహాయంతో చాలా చాకచక్యంగా, కొండచిలువకు ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది గ్రామస్తులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.

గ్రామ ప్రజలు ఎవరికైనా ఇటువంటి కొండచిలువలు కనబడితే వాటికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం, పట్టుకున్న ఈ కొండచిలువను స్థానిక రక్షిత అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టరు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story