Komaram Bheem: బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ నితికా పంత్
Komaram Bheem: కొమురం భీమ్ జిల్లా బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించిన ఎస్పీ నితికా పంత్.
Komaram Bheem: బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ నితికా పంత్
కొమురం భీం: వార్షిక తనిఖీల్లో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికపంత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, పోలీస్ సిబ్బంది పరేడ్‌ను పరిశీలించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించారు. స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, సీడీ ఫైళ్లు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల వివరాలను ఎస్సై సార్తజ్ పాషాను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టప్రకారం త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా సేవాభావంతో విధులు నిర్వహించాలని చెప్పారు.
అనంతరం పోలీస్ సిబ్బంది కిట్‌ను పరిశీలించి, వారి శాఖాపరమైన అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాహిదుద్దీన్, కౌటాల సీఐ సంతోష్ కుమార్ , బెజ్జుర్ ఎస్సై సార్తజ్ పాషా తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




