Koutala: ప్రాణహిత వరద ఉధృతి తుమ్మిడిహెట్టిలో కలెక్టర్ పరిశీలన

Koutala: కొమురం భీం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహితలో ప్రవాహం. తుమ్మిడిహెట్టి వద్ద వరదను పరిశీలించిన కలెక్టర్ హరిత. NDRF బృందాలు సిద్ధం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 31 July 2026 5:19 PM IST
Koutala
X

Koutala: ప్రాణహిత వరద ఉధృతి తుమ్మిడిహెట్టిలో కలెక్టర్ పరిశీలన

కౌటాల: కొమురం భీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామం వద్ద జిల్లా కలెక్టర్ హరిత స్వయంగా వరద పరిస్థితులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ, వరద నీటి మట్టం మరో రెండు నుంచి మూడు మీటర్లు పెరిగితే లోతట్టు గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభావితమయ్యే గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నామని, అవసరమైతే తరలింపు చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story