Komaram Bheem: మైనారిటీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Komaram Bheem: కొమరం భీం జిల్లా గన్నారం మైనారిటీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం.

LALITH KUMAR, SIRPUR
Published on: 16 Sept 2026 4:19 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: మైనారిటీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కొమరం భీం: కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం గన్నారంలో గల తెలంగాణ మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను ఆకసికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల హాజరు పట్టిక, వంటశాల, సరుకుల నిల్వ గది, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో పఠనా సామర్థ్యాన్ని నిర్వహించి వారికి అర్థమయ్యే రీతిలో పాటలను బోధించాలని, విద్యార్థులు 100 శాతం గురుకులంలో ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని, గురుకుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని తెలిపారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR