Kaghaznagar: మున్సిపాలిటీలో ప్లకార్డులతో వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల నిరసన!

Kaghaznagar: మున్సిపాలిటీలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ అనిత, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసనకు దిగారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 31 Aug 2026 2:39 PM IST
Kaghaznagar
X

Kaghaznagar: మున్సిపాలిటీలో ప్లకార్డులతో వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల నిరసన!

కాగజ్‌నగర్: కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, బీఆర్ఎస్ (BRS) కౌన్సిలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.

ఈసందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనిత మాట్లాడుతూ, పట్టణంలోని పలు కాలనీల్లో దోమల బెడద, వీధి కుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యలను ప్రస్తావిస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైందన్నారు.

అన్ని కాలనీల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని కౌన్సిల్‌లో చేసిన తీర్మానాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇప్పటివరకు పట్టణ ప్రజల ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కదానికీ పరిష్కారం చూపలేదని, పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story