Kagaznagar: కాగజ్‌నగర్ నుంచి కౌటాలకు ప్రత్యేక బస్సు వేయాలని వినతి
Kagaznagar: భాగ్యనగర్ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం కాగజ్‌నగర్ నుండి కౌటాల వరకు ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ దండే విఠల్‌ను కోరిన కౌటాల నాయకులు.
Kagaznagar: కాగజ్‌నగర్ నుంచి కౌటాలకు ప్రత్యేక బస్సు వేయాలని వినతి
కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు వచ్చే భాగ్యనగర్ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం కాగజ్‌నగర్ నుంచి కౌటాల మండల కేంద్రం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ కౌటాల మండలానికి చెందిన నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కి వినతి పత్రం సమర్పించారు.
కౌటాల మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణాలు చేస్తుంటారని నాయకులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా భాగ్యనగర్ రైలు ద్వారా కాగజ్‌నగర్‌కు చేరుకునే ప్రయాణికులు అక్కడి నుంచి కౌటాల మండల కేంద్రానికి రావడానికి సరైన ప్రజా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడి కాగజ్‌నగర్ నుంచి కౌటాల మండల కేంద్రం వరకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు




