Kagaznagar: అడవులు, వన్యప్రాణుల రక్షణకు పకడ్బందీ చర్యలు: కాగజ్‌నగర్ డీఎఫ్‌ఓ!

Kagaznagar: కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు డీఎఫ్‌ఓ టి. భార్గవ్ కుమార్ తెలిపారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 9 Sept 2026 6:04 PM IST
Kagaznagar
X

Kagaznagar: అడవులు, వన్యప్రాణుల రక్షణకు పకడ్బందీ చర్యలు: కాగజ్‌నగర్ డీఎఫ్‌ఓ!

కగజనగర్: కగజనగర్ అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణ, వన్యప్రాణుల వేట మరియు ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతర పెట్రోలింగ్, రక్షణ గస్తీ, వాహన తనిఖీలు మరియు సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.

అటవీ సిబ్బంది ప్రతిరోజూ తమ పరిధిలోని అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకావాలని. అవసరమైన ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్, మొబైల్ ప్యాట్రోలింగ్ మరియు సాంకేతిక పర్యవేక్షణ వంటి ఆధునిక పద్ధతులను కూడా వినియోగించాలని తెలిపారు.

అటవీ సంపదకు నష్టం కలిగించే అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వేట నిరోధక చర్యలు, నీటి వనరుల పర్యవేక్షణ, వన్యప్రాణుల కదలికల పరిశీలన కు డ్రోన్స్ వినియోగించాలని.FDO. Kaghaznagar సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story