Sirpur: 22-A నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి: కోనేరు కోనప్ప!

Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్. రైతులకు కరపత్రాల పంపిణీ, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం.

SRINIVAS, KOUTALA
Published on: 11 Sept 2026 7:19 PM IST
Sirpur
X

Sirpur: 22-A నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి: కోనేరు కోనప్ప!

సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో 22-A సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో రైతులతో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమావేశం నిర్వహించారు.

పట్టా పాస్‌బుక్కులు ఉన్న రైతుల భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 22-A సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను రైతులకు అందజేసి అవగాహన కల్పించారు.

రైతుబంధు రైతుబీమా అందకపోవడం, యూరియా యాప్ పనిచేయకపోవడం, కరెంటు కోతలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని ఆయన అన్నారు. రైతు హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని, రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఆయన విమర్శించారు. ఈ కారిక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు నాయకులు రైతులు కోనేరు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA