Mancherial: వేలాల ఇసుక రీచ్‌ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
Mancherial: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్ మండలంలోని వేలాల ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
Mancherial: వేలాల ఇసుక రీచ్‌ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
Mancherial: ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్‌సైట్ ద్వారా చేపడుతున్న ఇసుక సరఫరా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
జైపూర్ మండలంలోని వేలాల ఇసుక రీచ్‌ను తహసీల్దార్ వనజ రెడ్డితో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరా, ఆన్‌లైన్ బుకింగ్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు నిర్ణీత గడువులోగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుకను పారదర్శకంగా, అధికారికంగా అందించేందుకే ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్‌సైట్ ద్వారా సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జాతీయ రహదారి 163జి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




