Penchikalpet: 339 మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేత!
Penchikalpet: పెంచికల్‌పేట్ మండలం పోతపల్లి గ్రామంలో 339 మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అధికారులు పంపిణీ చేశారు.
Penchikalpet: 339 మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేత!
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలం పోతపల్లి గ్రామంలోని రేషన్ డీలర్‌షాప్‌లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్, ఉపసర్పంచ్ గిరుగుల చిన్నయ్యతో కలిసి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 339 మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో జీపీఆర్ఓ షారుక్, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు మోర్లే బాపూరావు, వార్డు సభ్యులు బండి వెంకటాచలం, తోగామ సాయి, స్థానిక రేషన్ డీలర్ తెలిగ సుగుణ, గణేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Next Story




