Asifabad: డీజేలకు నో పర్మిషన్.. వినాయక మండపాలపై ఎస్సై కీలక ఆదేశాలు!

Asifabad: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చింతలమానేపల్లి ఎస్సై కమలాకర్ మండపాల నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 10 Sept 2026 5:38 PM IST
Asifabad
X

Asifabad: డీజేలకు నో పర్మిషన్.. వినాయక మండపాలపై ఎస్సై కీలక ఆదేశాలు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి వినాయక చవితి ఉత్సవాలను మండలంలో ప్రశాంతమైన, సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని చింతలమానేపల్లి ఎస్సై కమలాకర్ విజ్ఞప్తి చేశారు.

వినాయక పండుగను పురస్కరించుకొని గురువారం మండలంలోని వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, భద్రతకు సంబంధించి పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ...

ఉత్సవాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకోవాలని ఆదేశించారు.

పోలీస్ శాఖ అందించిన ముఖ్య సూచనలు:

ముందస్తు అనుమతులు తప్పనిసరి:

వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధించి పోలీస్, విద్యుత్ మరియు గ్రామ పంచాయతీల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.

భద్రతా చర్యలు:

మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా మైక్ సెట్లు, విద్యుత్ వైర్ల విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి.

రాత్రి వేళల్లో మండప సమక్షంలో నిర్వాహకులు తప్పనిసరిగా పహారా ఉండాలి.

శబ్ద కాలుష్య నియంత్రణ: అత్యధిక శబ్దంతో డిజె (DJ)లు వాడటం నిషిద్ధం. మైక్ సెట్లకు అనుమతించిన సమయంలో మాత్రమే అనుమతించిన పరిమితిలో సౌండ్ బాక్సులు వాడుకోవాలి.

నిమజ్జనం జాగ్రత్తలు:

నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిర్దేశించిన మార్గాల్లోనే ఊరేగింపు సాగించాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ, గొడవలకు దిగడం కానీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనతో, సోదరభావంతో వేడుకలను జరుపుకొని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై కోరారు.

ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాల వినాయక మండప కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story