Chintalamanepally: చింతలమానెపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ బాబు
Chintalamanepally: చింతలమానెపల్లి MPP సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. బాబాపూర్ PHCలో అదనపు డాక్టర్ల నియామకానికి హామీ.
Chintalamanepally: చింతలమానెపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ బాబు
చింతలమానెపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ బాబాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారని, అదనంగా డాక్టర్లను నియమించి మెరుగైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు.
మండలంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని తెలిపారు. సర్పంచులు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, తాసిల్దార్ ప్రకాష్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




