Chintalamanepally: 3 రోజుల ఉపాధ్యాయ ఇన్-సర్వీస్ శిక్షణను ప్రారంభించిన ఎంఈఓ
Chintalamanepally: చింతలమానేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 3 రోజుల ఇన్-సర్వీస్ టీచర్ శిక్షణ ప్రారంభించిన ఎంఈఓ జయరాజు. ఎఫ్‌ఎల్‌ఎన్, రెమిడియేషన్ కార్యక్రమాలపై మార్గదర్శనం.
Chintalamanepally: 3 రోజుల ఉపాధ్యాయ ఇన్-సర్వీస్ శిక్షణను ప్రారంభించిన ఎంఈఓ
చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు మండల విద్యాధికారి శ్రీ పి . జయరాజు చేత ప్రారంభించబడ్డాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SCERT తెలంగాణ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే FLN (Foundation Literacy & Numeracy) కార్యక్రమం ద్వారా రాష్ట్రం జాతీయ స్థాయిలో 36వ స్థానం నుండి 26వ స్థానానికి చేరుకోవడం ప్రతి ఉపాధ్యాయుని కృషి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ శిక్షణలో భాగంగా విద్యార్థుల అభ్యాస లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు 'రెమిడియేషన్' అనే నూతన కార్యక్రమాన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వి . పెద్దులు, మరియు మండల రిసోర్స్ పర్సన్లు B మహేందర్ గౌడ్,B సచిన్,E సాయి,S కిరణ్ కుమార్ మరియు మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




