Mancherial: ఘనంగా మదన పోచమ్మ దేవాలయ హుండీ లెక్కింపు

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శ్రీ మదన పోచమ్మ దేవాలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు.

RAJENDER, CHENNUR
Published on: 24 July 2026 5:50 PM IST
Mancherial
X

Mancherial: ఘనంగా మదన పోచమ్మ దేవాలయ హుండీ లెక్కింపు

Mancherial: చెన్నూరు పట్టణంలోని శ్రీ మదన పోచమ్మ దేవాలయ హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు ఈ రోజు లెక్కించారు. హుండీలోని ఆదాయన్ని లెక్కించగా అందులో కరెన్సీ నోట్లు రూ 4,38,520/- అలాగే, చిల్లర నాణములు రూ. 61,246/- మొత్తంగా హుండీ ఆదాయం రూ 4,99,766/- వచ్చిందని మదన పోచమ్మ ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ తెలిపారు.

ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నట్టు తెలిపారు. ఈ ఆషాడ మాసం బోనాల సందర్భంగా శ్రీ మదన పోచమ్మ ఆలయానికి విచ్చేస్తున్న భక్తుల ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని, భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

అలాగే రానున్న రోజుల్లో శ్రీ మదన పోచమ్మ దేవాలయ ఆవరణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సహాయ కమిషనర్ బి. సుదర్శన్ పటేల్, బి. శ్రీనివాస్ ఈఓ, ఆలయ సిబ్బంది, పూజారులు, పోలీస్ సిబ్బంది మరియు భజన భక్తులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story