Chennur: చెన్నూరులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం.. క్రీడా జ్యోతి ర్యాలీ!
Chennur: ప్రభుత్వ హైస్కూల్‌లో మేజర్ ధ్యాన్ చంద్ 121వ జయంతి వేడుకలు. గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా జ్యోతి ర్యాలీ, కరాటే మాస్టర్ మధునయ్యకు సన్మానం.
Chennur: చెన్నూరులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం.. క్రీడా జ్యోతి ర్యాలీ!
Chennur: చెన్నూర్ పట్టణం లోని గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ధ్యాన్ చంద్ 121 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి హై స్కూల్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ప్రజలు తమకు ఇష్టమైన క్రీడను ఆడేందుకు తమ రోజులో కొంత సమయం కేటాయించాలని, శారీరకంగా, మానసికంగా తమను తాము దృఢంగా ఉంచుకోవడానికి రోజువారీ జీవితంలో క్రీడలను ఆడే అలవాటును పెంపొందించుకోవాలని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య తెలిపారు.
అనంతరం, కరాటే విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దిన కరాటే గురువు అట్టెం మదునయ్య ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు, మరియు వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.




