Chennur: ప్రతిపక్షాలవి దొంగ ఆరోపణలు చెన్నూరులో మంత్రి వివేక్ ఆగ్రహం

Chennur: చెన్నూరులో పత్రికా సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం, రోడ్డు వెడల్పు పనులపై ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

RAJENDER, CHENNUR
Published on: 19 Aug 2026 7:01 PM IST
Chennur
X

Chennur: ప్రతిపక్షాలవి దొంగ ఆరోపణలు చెన్నూరులో మంత్రి వివేక్ ఆగ్రహం

చెన్నూరు: చెన్నూరు నియోజకవర్గంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతిపక్షాలు కావాలనే తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మడిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

వివేక్ సార్ కామెంట్స్...!

చెన్నూరు పట్టణ ప్రజలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చెన్నూరు పట్టణ ప్రజలను అందరిని సంప్రదించి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించడం జరిగిందని, దానికి పట్టణ ప్రజలందరూ సహకరించినందుకు ఈ సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చెన్నూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. చెన్నూరు పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులలో పట్టణ ప్రజలు స్వయంగా ముందుకి వచ్చి మేమే స్వయంగా మా ఇండ్లను కూల్చుకుంటామని చెప్పారు. ఇప్పటికే కోటి ఎనభై లక్షల రూపాయల నిధులతో చెన్నూరు బైపాస్ రోడ్డును నిర్మించడం ప్రారంభం కూడా జరిగిందని తెలిపారు.

ప్రజా పాలనలో భాగంగా ప్రజలతో చర్చలు జరిపిన తర్వాతనే రోడ్డు పనులను జరుపుతున్నామని, బీజేపీ పార్టీ వారు కావాలనే రోడ్డు పనులు జరగడం లేదని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు పనుల్లో ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారో వారికి వేరే చోటా ఉపాధి కల్పిస్తా మని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులకు మరోచోట ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారికి కూడా షాపులు కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

బీజేపీ లాగా బోల్డోజర్ పాలనను నేను నడపడం లేదని, చెన్నూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పనులు చేస్తున్నాము, చెన్నూరు లో అన్ని రంగాల్లో అభివృద్ధి కి నిధులను మంజూరు చేసుకోవడం జరిగింది తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల్లో స్థానికంగా ఉన్న అన్ని దేవాలయాలను అభివృధి చేస్తున్నామని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తి పోయాలని కేటీఆర్ హరీశ్ రావు కావాలనే ఉద్యమాలు చేశారు. కానీ కాలేశ్వరం ప్రాజెక్టులోని నీరు లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండి కుండల మారిందని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టులోని నీరు కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టుని ఎత్తి నీటిని నింపడానికి మాత్రమే పంపుల ద్వారా పంపింగ్ చేయడం జరుగుతుందని వివరించారు.

మొదటి సారి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం 60 టీ ఏం సీ నీళ్ళను పంపింగ్ చేసి మళ్ళీ వర్షాలు పడగానే విడిచిపెట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా 3 వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కరెంటు బిల్లుల రూపంలో వృథా చేశారు. గొల్లవాగు ప్రాజెక్టు నుండి రైతులకు నీరు అందించడానికి అనుమతులు తీసుకున్నాము.

జైపూర్ మండలంలోని మొసళ్ళ మడుగును టూరిస్ట్ సెంటర్ గా ఏర్పాటు చేస్తాము. నేను ఏప్రిల్ లో జర్మనీ పోయినప్పుడు అక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకున్నాను. ఇక్కడ యువతకు జర్మనీ లాంగ్వేజ్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శిక్షణ ఇప్పిస్తున్నాను.

త్వరలోనే యువతకు సంవత్సరానికి 25 నుండి 30 లక్షల జీతాలు పొందేలా అవకాశం కల్పిస్తున్నాం అని వివరించారు. కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని ప్రతి పక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ కేసు కోర్టులో నడుస్తుంది దాని పైన తప్పకుండా ప్రభుత్వ వాదనలు వినిపించి త్వరలోనే కేసు గెలుస్తాం అని ఆశాభావం వ్యక్తం చేశారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story